పెట్రోల్ బంక్ లో నాణ్యమైన పెట్రోల్ అమ్ముతున్నారా లేదా అని తనిఖీ చేసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది
పెట్రోల్ బంక్ లో నాణ్యమైన పెట్రోల్ అమ్ముతున్నారా లేదా అని తనిఖీ చేసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ప్రతి బంక్ లోనూ ఆయా నిర్వాహకులు తమ వద్ద విధిగా క్వాలిటీ టెస్టింగ్ పేపర్ (ఫిల్టర్ పేపర్ ) ఉంచు కోవాల్సి ఉంది.ఎవరైనా బంక్ వద్దకు వెళ్లి టెస్టింగ్ పేపర్ ఇవ్వమంటే ఇస్తారు.
ఆ పేపర్ పై పెట్రోల్ పంప్ గన్ నుండి కొన్ని చుక్కలు వేయాలి.5నుండి10 సెకండ్ల లోనే మీరు వేసిన పెట్రోల్ ఆవిరై తిరిగి యధా విధిగా పేపర్ తెల్లగా మారిపోతుంది. కొంచెం కూడా తడి కనిపించదు.అప్పుడు ఆ పెట్రోల్ నాణ్యమైనదని అర్ధం.
అలా కాకుండా పేపర్ మచ్చ కనపడిన తడి అరక పోయిన అది కల్తీ పెట్రోల్ గా గుర్తిoచాలి.మీరు పేపర్ ఇవ్వమని అడిగి నప్పుడు పేపర్లు లేవని చెప్పినా,లేదా తనిఖీకి అంగీకరించక పోయినా రెండూ నేరాలు గానే పరిగణిస్తారు.చట్ట ప్రకారం బంక్ పై చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది.
పిర్యాదు ఎవరికి చేయాలి ?
పెట్రోల్ లో కల్తీ జరిగినట్లు గుర్తిస్తే మనం పౌర సరఫరా అధికారులకు పిర్యాదు చేయాలి.అలాగే విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ అధికా రులకు చేయొచ్చు.
వాస్తవంగా పెట్రోల్ బంక్ వ్యవహారాన్ని సివిల్ సప్లై లోని ASO చూస్తారు.ప్రతి మండలంలోనూ MSO వుంటారు. ఎవరికి వారు స్థానికంగా ఉన్న MSO కి కూడా పిర్యాదు చేయొచ్చు. లేదా నేరుగా ASO కి పిర్యాదు చేస్తే సరిపోతుంది.
అన్ని ప్రాంతాలకు ఒకే ఫోన్ నెంబర్ ఉండదు. తహసీల్దార్ కార్యాలయంలో అడిగితే నెంబర్ చెబుతారు. తెలుసుకుని పిర్యాదు చేయొచ్చు.
Comments
Post a Comment